మోసపోయిన బాధితులకు అండగా యూఏఈ జనసేన

  • మానవత్వం చాటిన పాపోలు వీరాస్వామి, అప్పారావు బ్రదర్స్

యూఏఈలో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఒక్కొక్కరి నుండి ₹1,50,000 చొప్పున డబ్బులు కట్టించుకొని ఆంధ్ర నుండి షార్జా వరకు తీసుకెళ్ళి అక్కడ వారిని ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేస్తున్న వదంతాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఇంకొక ఉదంతమే మోసపోయిన ఐదుగురు కుర్రాళ్ళ కథ, ఉంగుటూరు గ్రామంలో నడుపుతున్న ట్రస్టు పాపోలు వీరాస్వామి, అప్పారావు బ్రదర్స్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్న యూఏఈ జనసేనకు చెందిన పాపోలు వీరాస్వామి, అప్పారావు వెంటనే స్పందించి ఐదుగురు కుర్రవాళ్ళని తమ కంపెనీలో పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పించి వాళ్లకు దారి చూపించారు. బాధితులు ఎలా మోసపోతున్నారో చాలా వివరంగా చెప్పారు. బాధితులు పాపలు వీరాస్వామి, అప్పారావు బ్రదర్స్ కు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాపోలు అప్పారావు మాట్లాడుతూ గల్ఫ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న మోసాల గురించి తెలుసుకొని చాలా బాధ కలిగిందని, మా వరకు వచ్చిన అన్ని మేము సానుకూలంగా స్పందించి సహాయం చేయడం జరుగుతుందని చెప్పారు. ఆంధ్ర నుండి యూఏఈ కి ఈ విధంగా ఉద్యోగాల కోసం వచ్చి మోసపోయేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉండే బ్రదర్స్ జనసేన యొక్క సిద్ధాంతాలు, అద్భుతమైన జీవితాన్ని వదులుకొని ప్రజల కోసమే పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ పోరాటాలు చూసి యూఏఈ జనసేన ద్వారా జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసే పోరాటంలో తాము కూడా పాలుపంచుకుంటామని, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తమవంతు పాత్ర పోషిస్తామని తెలిపారు.