ఘనంగా శ్రీకాళహస్తి జనసేన పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు

ఉగాది పర్వదినాన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నాయకులు, వీర మహిళలు, జనసైనికుల సమక్షంలో ఉగాది వేడుకలు ఘనంగా తెలుగుతనం ఉట్టిపడేలా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి, నియోజకవర్గంలోని నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, ప్రజల తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వినుత కోటా చేతుల మీదుగా అందరికీ షడ్రుచులలో కూడిన ఉగాది పచ్చడిని ప్రసాదంగా అందించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండల నుండి ముఖ్యమైన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment