మంచి కామెంట్స్ అందుకున్న ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’

ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా (జూలై 30)న విడుదలైంది. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. టీజర్, సాంగ్స్‌తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్ థియేటర్ల పున:ప్రారంభం కోసం ఎదురుచూశారు. అయితే ఇప్పట్లో పరిస్థితి అనుకూలించకపోవచ్చని గ్రహించి నెట్ ఫ్లిక్స్‌లో నేడు విడుదల చేశారు. ఇక ఈ సినిమాను వీక్షించిన వారంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సామాన్య జనంతో పాటు సెలెబ్రిటీలు సైతం ఉమా మహేశ్వరుడిపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్.. చిత్రయూనిట్‌ను మరీ ముఖ్యంగా సత్యదేవ్‌ను పొగిడాడు. నరేష్, కోన వెంకట్ వంటి వారు సినిమాపై తమ అభిప్రాయాన్ని ప్రకటించారు. అందరూ చిత్రం విజయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అందరిలోనూ నాని చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య ఓ అద్భుతమైన చిత్రం.. థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత దయచేసి మళ్లీ రిలీజ్ చేయండి.. ఆ స్లో మోషన్‌లో, ఆ క్లోజప్ సీన్స్, ఆ నవ్వులు బిగ్ స్క్రీన్‌పై మరొక సారి చూడాలని అనుకుంటున్నాను. డైరెక్టర్ వెంకటేష్ మహా ఎంతో నిజాయితీగా చిత్రాన్ని తెరకెక్కించాడు. డియర్ సత్యదేవ్ నేను నీకు ఫ్యాన్ అయ్యాను. సుహాస్ అందర్నీ నవ్వించాడు’ అంటూ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు.