పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోలేక – సినిమాలపై ప్రతాపం చూపిస్తున్నారు
*మీకు చేత కాకపోతే, పక్క రాష్ట్ర ప్రభుత్వాలను చూసి నేర్చుకోండి
*బెనిఫిట్స్ షోలను ఆపటం, టికెట్ల రేట్లను తగ్గించడం లాంటి పనికిమాలిన చర్యలను ఖండిస్తూ అభిమానులు నిరసన.
తిరుపతి, రాత్రికి రాత్రి కొత్త జీవోలను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా నోటీసులు జారీ చేయడం చాలా బాధాకరం ఇలాంటి చేతగాని సంఘటనలను తీవ్రంగా ఖండిస్తూ అభిమానులు తిరుపతి నందు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అభిమాన సంఘాల నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని నేరుగా ఎదుర్కోలేక సినిమా బెనిఫిట్ షో మీద టికెట్ మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు వీరి ఎన్ని కుట్రలు పన్నినా సినిమాని ఆపలేరని, వెంటనే బెనిఫిట్ షోలకు పక్క రాష్ట్రాల వారిని చూసైనా నేర్చుకొని ఆంధ్రరాష్ట్రంలో పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి సురేష్, కొండ రామ్మోహన్, కృష్ణయ్య, ఆనంద్, ఈశ్వర్ రాయల్, రాజేష్ నాయక్, హేమంత్, తులసీ, మోహన్, కోమల్, దిలీప్, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-24-at-1.53.09-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-24-at-2.19.00-PM-1024x723.jpeg)