సంస్కారహీనుడు జోగి రమేష్: ఎస్ వి బాబు

  • మంత్రి అయినా నీ చిల్లర మాటలు, వెకిలి వేషాలు పోలా జోగి

పెడన, చిన్నపిల్లలు దైవ స్వరూపులు అలాంటి చిన్నారులతో పూలు జల్లించుకుంటున్న జోగి రమేష్ కు సిగ్గులేదు. కనీసం ఈ ప్రోగ్రాం ఆర్గనైజేషన్ చేసిన వ్యక్తులకు, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికైనా బుద్ధి లేదా? విద్యార్థిని, విద్యార్థులు అయిన భావి భారత పౌరులతో మాట్లాడేటప్పుడు సంస్కారవంతమైన భాష వాడాలని తెలియని నీలాంటివాడు మంత్రి అయినందుకు, నిన్ను ఎన్నుకున్న ప్రజల సిగ్గుపడుతున్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ఏకవచనంతో సంబోధిస్తూ (వాడు వీడు అంటూ) నీ కుసంస్కారాన్ని చెప్పుతో కొట్టే రోజు దగ్గర్లోనే ఉంది. ఆంగ్ల మాధ్యమానికి ఎవరు వ్యతిరేకులు కారు. మాతృభాష అయిన తెలుగు మాధ్యమానికి సరైన గౌరవం ఇవ్వాలని ప్రతి ఒక్కరు చెప్పేది. మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. దురదృష్టవశాత్తు నీలాంటి అజ్ఞానులకు అర్థం కావడం లేదు. జోగి రమేష్ నీ పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖబర్దార్ అంటూ పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.