అవనిగడ్డ జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు

అవనిగడ్డ: జగనన్న కాలనీలు – పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న మోసం హాష్ ట్యాగ్ తో మొదటి రోజు అవనిగడ్డ మండలంలోని జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు….. అశ్వారావు పాలెం, మోదుమూడి, మండలిపురం, పులిగడ్డ, తిప్పపాలెం గ్రామాలలోని జగనన్న కాలనీలు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అవనిగడ్డ మండల జనసేన నాయకులు మాట్లాడుతూ అశ్వారావు పాలెం గ్రామంలో జగనన్న కాలనీకి వెళ్లే పదిహేను అడుగుల ప్రధాన రహదారి నిర్మించకపోవడం కారణంగా గృహాలు నిర్మించుకునే లబ్ధిదారులు మెటీరియల్ స్థలంలోకి చేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, మోదుమూడి గ్రామంలోని జగనన్న కాలనీలో కూడా రోడ్డు సౌకర్యం, మంచినీటి సౌకర్యం లాంటివి ఇప్పటివరకు కల్పించడం లేదని, లక్ష వరకు డబ్బులు కట్టించుకున్న కాంట్రాక్టర్ చేతులెత్తేశారని జనసేన నాయకుల వద్ద లబ్ధిదారులు వాపోయారు. మండలి పురం కాలనీలో ఇప్పటికి కూడా ఆరడుగుల మేర నీరు నిల్వ ఉండి గృహం నిర్మించుకోవడానికి ఏమాత్రం అనుకూల పరిస్థితులు లేకపోవడం కారణంగా లబ్ధిదారులు ఇద్దరు మాత్రమే ముందుకు వచ్చారని మిగిలిన 50 మంది ఇల్లు నిర్మించుకోవడానికి వెనకడుగు వేస్తున్నారని జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి కొరడా పట్టుకుని ఎమ్మెల్యేలను తరుముతూ ఇంటింటికి తిప్పుతున్నారని, వీరు చేయాల్సింది గడపగడపకు తిరగటం కాదని జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్న జగనన్న కాలనీల చుట్టూ తిరిగి, రోడ్లు కల్పించడం, మంచినీటి సౌకర్యం కల్పించడం, విద్యుత్తు సరఫరా జరిగేటట్లు చూడటం, ఇసుక కొరత రాకుండా చూడటం, నిర్మించిన గృహాలకు బిల్లులు వెంటనే మంజూరయ్యేలా చూడటం లాంటి కార్యక్రమాలు చేయాలని, అలా చేయని పక్షంలో ఇప్పుడు జగనన్న కాలనీలు చుట్టూ సందర్శన చేసిన జనసేన శ్రేణులు తరువాత కాలంలో ఎమ్మెల్యేల కార్యాలయాలు ముట్టడిస్తామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు, మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, ఎంపీటీసీ బొప్పన భాను, ఎంపీటీసీ కటికల వసంత్, బచ్చు వెంకట నారాయణ, తుంగల వేణు, రాజనాల వీరబాబు, కమ్మిలి సాయి భార్గవ, బచ్చు శ్రీహరి, బాల భాస్కర్, శివ నాగులు, మండలి ఉదయ్, పవన్ కళ్యాణ్, రాజేష్, తుంగల నరేష్, కోసూరి అవినాష్, భాస్కర్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.