పెడన జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు

పెడన: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు.. జనసేన పార్టీ చేపట్టిన కార్యక్రమం ఆదివారం గూడూరు మండలంలోని ఆకుమర్రు, రాయవరం గ్రామాలలోని జగనన్న కాలనీలలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో బాగంగా పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు మరియు # JaganannaMosam ప్లకార్డ్స్ తో సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ పరిశీలనలో రాయవరం గ్రామంలో జగనన్న ఇళ్ల కోసం కేటాయించిన స్థలాలు కనీసం ఒక ఇల్లు కూడా ప్రారంభించలేదు ప్రారంభించాలంటే వచ్చినవారు ప్రతి ఒక్కరు రెండు లక్షల రూపాయల వరకు మట్టికే ఖర్చు అవుతుంది లేదంటే వర్షాలు వచ్చినప్పుడు కాలనీ మొత్తం నీళ్లలోనే ఉండే పరిస్థితి అంత దిగువన స్థలాన్ని పేదలకు ఇస్తే ఎలా ఇళ్ళు ఎలా కట్టుకుంటారు? ఇక్కడ మరొక కారణం జగనన్న కాలనీకి వెళ్లటానికి సరైన దారి కూడా లేదు. జగనన్న కాలనీలలో జరుగుతున్న అవినీతి అక్రమాలను గురించి పరిశీలించి వాటిని గుర్తించడం జరిగింది. త్వరలోనే ఈ జగనన్న ఇళ్లు అవినీతి కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పూర్తిస్థాయిలో బయటపెట్టబోతున్నాము అని జనసేన నాయకులు రామ్ సుధీర్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలగాని లక్ష్మీ నారాయణ, పూల్లేటి దుర్గా రావు, మల్లి బాబు, బాకీ నాని, అంజిబాబు, అశోక్, వినోద్, శివ, అఖిల్, పవన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.