జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీ

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు ఆధ్వర్యంలో, సంక్రాంతి సందర్భంగా మహిళలకు ఎంతో ఘనంగా ముగ్గుల పోటీ కార్యక్రమం మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమం శనివారం నాడు స్థానిక రైల్వే రోడ్డులోని అంగ రంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సుమారు వందకు పైగా మహిళలు పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. మొదటి బహుమతి విజేత ఎస్ స్వప్న, రెండవ బహుమతి విజేత డి అనిత, మూడో బహుమతి విజేత కె హరిత గెలుపొందారు. మొదటి 20 విజేతలకు చీరలు బహుమతులుగా ఇవ్వడం జరిగినది. అంతేకాక ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళలకు జనసేన పార్టీ తరుపున బహుమతి అందించినారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీమతి పరింగి కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొట్టుకు రమేష్, దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కళ్యాణ్ ముత్యాలు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి రాయిని రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీమతి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి గోవింద కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి శ్రీమతి ఆకుపాటి ఉష, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి శ్రీమతి సుంకర కళ్యాణి, ఒంగోలు నగరపాలక మహిళ గూడా శశిభూషణ్, జరుగుమల్లి మండల అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, పొన్నలూరు మండల అధ్యక్షులు ఎల్లమరిద్దినీ విశ్వ, కొండేపి మండల అధ్యక్షులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ముఖ్య పాత్ర వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఈ కార్యక్రమానికి మొదటి బహుమతి 5,116/- దాత జనసేన నాయకులు దండే ఆంజనేయులు, రెండవ బహుమతి 3,116/- దాత కొత్తపల్లి శ్రీ హర్ష, మూడో బహుమతి 2116/- కించెం శెట్టి రవిబాబు. ఈ ముగ్గుల పోటీలో మొదటి 20 విజేతలకు చీరలు బహుమతులు అందజేసిన దాతలు. ఐనాబత్తిన రాజేష్ సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు, గణేష్, కొత్తపల్లి శ్రీహర్ష, జనసేన నాయకులు సయ్యద్ చాన్ బాషా, చలువాది వెంకట సుబ్బారావు. ఈ ముగ్గులపోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు ఇచ్చిన దాతలు, కాసుల శ్రీనివాస్, కాసుల శ్రీకాంత్, శీలం సాయి, పోనుగోటి డేవిడ్. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల జనసేన నాయకులు జనసైనికులు మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినారు.