జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్లు

డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 12, 13, 14 తేదీలలో జగనన్న కాలనీలు మరియు టిడ్కో ఇళ్ళు పరిశీలించి అవకతవకలను బయట పెట్టడం సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగు తుందని జనసేన పార్టీ అమలాపురం నియోజక వర్గం ఇంచార్జ్ శెట్టి బత్తుల రాజబాబు అన్నారు. అమలాపురం ప్రెస్ క్లబ్ భవన్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 28 లక్షల 30 వేల ఇళ్ళు నిర్మాణం చేస్తామని అందులో భాగంగా ఈ సంవత్సరం జూన్ మాసంలో 18 లక్షల 63 వేల 552 ఇళ్ళు నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందజేస్తామని, శుష్క వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు అన్నారు. అదేవిధంగా అమలాపురం నియోజకవర్గంలో సుమారు 9000 పైగా లబ్ధిదారులు ఎంపిక జరిగినప్పటికీ ఈరోజు వరకు ఒక గృహం కూడా నిర్మించలేదు. అత్యంత ఆర్భాటంగా సుమారు 23,500 కోట్లు రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేశారని కనీసం ఎకరం 10 లక్షల నుంచి 20 లక్షలు కూడ విలువచేయని భూములకు 70 లక్షల నుండి కోటి రూపాయలు పైగా ఎకరాకు చెల్లించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా పెద్ద ఎత్తున భూమి కొనుగోలులో స్కామ్ జరిగింది. తక్షణమే పేదలందరికీ ఇళ్ళు నిర్మించాలని కోరుతూ అదే విధంగా జగనన్న కాలనీ పేరుతో జరిగినటువంటి అవకతవకలను బయటకు తీస్తామని అమలాపురం నియోజకవర్గం జనసైనికులు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జగనన్న మోసంఅని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని నియోజకవర్గ ఇన్చార్జ్ శెట్టిబత్తులరాజబాబు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శి మహాదశ నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీను, కార్యదర్శి చిక్కాల సతీష్, కౌన్సిలర్లు పిండి అమరావతి, గండి హారికాస్వామి, గొలకోటి విజయలక్ష్మి వాసు, సీనియర్ నాయకులు సూదా చిన్న, ఆకుల బుజ్జి, చిక్కం సుధా సూర్యమోహన్, తూము రమేష్, మంచిగంటి మాచరరావు, కారెం వెంకట్రావు, నామాడి నాగరాజు, గొలకోటి వెంకటేష్, సత్తి శ్రీనివాస్, పొణకల ప్రకాష్, అరళ్ళపల్లి దుర్గ కరీముల్లా బాబా, మహ్మద్ షరీఫ్, షఫీ తదితరులు పాల్గొన్నారు.