అభివృద్ధికి నోచుకోని బాలికల వసతి గృహం

మర్రిపాడు మండల కేంద్రములోని బాలికల వసతి గృహంలో చోటు చేసుకున్న అభివృద్ధి రాహిత్యాన్ని జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఓరుగంటి ప్రమీల స్వయంగా సందర్శించి పరిశీలించారు. శౌచాలయాల డోర్లు లేక, నీటి సౌకర్యం లేక బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహంలో మోటార్ ఉన్నా, విద్యుత్ లేకపోవడం వల్ల చేతి పంపుతోనే నీటి అవసరాలు తీరుస్తున్నారని తెలిపారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు బాలికలు ఉంటున్న ఈ వసతి గృహంలో వర్షాకాలంలో దోమలతో కూడా విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దయనీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మౌలిక సదుపాయాలను అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Share this content:

Post Comment