వ్యక్తి మరణించిన కుటుంబాలకు అర్ధిక సాయమందించిన ఉండ్రాజవరం జనసేన

నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలో

1.చిట్టాల కాంతమ్మ
2.మైలెరు కృపావరం
3.గుత్తికొండ ముత్యాలమ్మ
4.ఉచ్చుల కిషోర్
5.ఉండ్రాజవరపు నరసింహులు

కాలం చేసిన కారణంగా వారి కుటుంబాలను పరామర్శించి, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ…ఉండ్రాజవరం జనసేన పార్టీ తరఫున ఆ 5 కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి 5000/ చొప్పున మొత్తం 25000/ రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. దీనికి సహకరించిన జనసైనికులు అందరికీ ధన్యవాదములు తెలిపారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమంలో భాగంగా ఇక ముందు కూడా ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించాలని ఉండ్రాజవరం జనసేన పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.