బర్త్‌డే వేడుకల్లో అపశృతి, ఆ తల్లితండ్రులకు బిడ్డగా నిలుస్తా.. పవన్ హామీ

పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా.. చిత్తూరు జిల్లా కుప్పం – పలమనేరు హైవేపై ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి ముగ్గురు మృతి చెందారు. తన అభిమానుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… జనసైనికుల మరణం మాటలకందని విషాదమని పేర్కొన్నారు. అభిమానుల మృతి తన మనసును కలచివేసిందని ఆ తల్లితండ్రుల గర్భ శోకాన్ని అర్థం చేసుకోగలను. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక ఆ తల్లితండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తూ.. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకొంటాను అని పవన్ కల్యాణ్ ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి కూడా అండగా ఉంటామన్నారు పవన్. బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సహాయం అదించాలని చిత్తూరు జిల్లా జనసేన నేతలను ఆదేశించారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.

 బుధవారం పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా.. చిత్తూరు జిల్లా కుప్పం – పలమనేరు హైవేపై ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. 20 అడుగుల ఎత్తున పవన్ బ్యానర్ కడుతుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం మృతిచెందారు.. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.