యూనియన్ వారికి అండగా ఉంటాం: రాయపురెడ్డి కృష్ణ

మాడుగుల, రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగురోజులుగా అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ వారు చేపడుతున్న రిలే నిరసన దీక్షకు మద్దతుగా శుక్రవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మాడుగుల నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ బాద్యులు రాయిపురెడ్డి కృష్ణ అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ కే కోటపాడు తాసీల్ధార్ ఆఫీస్ వద్ద చేపడుతున్న నిరసనలో పాల్గొని తమ మద్దతు తెలియచేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ తాలూకా న్యాయమైన కోర్కెలకు తమ మద్దతు తెలిపి వెంటనే వారికి రావాల్సిన బకాయులను తీర్చాలని, ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో తాను ప్రతిపక్ష నేతగా ఉండగా ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లు ఏదైతే గౌరవ వేతనంగా 26 వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆ యొక్క హామీని నెరవేర్చాలని గతంలో కూడా తెలంగాణ కంటే ఎక్కువ వేతనం మీకు పెంచుతామని చెప్పి మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలను విస్మరించి మాట తిప్పారని రాయప రెడ్డి కృష్ణ గారు నిలదీశారు. ఈ కార్యక్రమంలో కే కోటపాడు మండల జనసేన నాయకులు కుంచా అంజి బాబు, చుక్కా నారాయణ మూర్తి, భీమవరం రాము, శ్రీను గణేష్, శివ తదితరులు పాల్గొన్నారు.