ఒక్కటైన నాయకులు – జనసేన గెలుపే లక్ష్యం

  • ఐకమత్యంతో కలిసి పోరాడుదాం.. జనసేన నాయకులు

రాజంపేట: జనసేన నాయకులు మలిశెట్టి వెంకటరమణ, యం. వెంకటేశ్వర రావు, యల్లటూరు శ్రీనివాసరాజులు ఒక్కటయ్యారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి గెలుపు బావుట ఎగురవేసేందుకు చేయి-చేయి కలిపారు. రాజంపేట నియోజకవర్గంలోనూ, రాష్ట్రంలోనూ జనసేన-టిడిపి కూటమి గెలుపే లక్ష్యంగా ఐకమత్యంతో కలిసి పోరాడాలని జనసేన పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ, డి ఆర్ డి ఏ రాష్ట్ర మాజీ అధికారి యల్లటూరు శ్రీనివాసరాజు కలిసి పిలుపునిచ్చారు. శనివారం ఇండియన్ గ్యాస్ వద్ద గల జనసేన పార్టీ కార్యాలయంలో వారందరూ సమావేశమై పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మరియు యం.వెంకటేశ్వర రావు ఇరువురూ మాట్లాడుతూ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన యల్లటూరు శ్రీనివాసరాజు పార్టీలోకి రావడం, కలిసి పని చేద్దామని ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఇది గెలుపుకు నాంది అని తెలియజేశారు. యల్లటూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వలన నియోజకవర్గం అన్ని విధాలా వెనకబడిందని, అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయించినా కలిసికట్టుగా, ఐకమత్యంతో రాజంపేట నియోజకవర్గంలోనూ, రాష్ట్రంలోనూ జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేసి రాజంపేట అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. వైసిపి పాలనలో బడుగు బలహీన వర్గాలే కాకుండా అన్ని రకాల వర్గాల ప్రజలు అణచివేయబడ్డారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు ప్రజలలోకి తీసుకెళ్లి జనసేన ను అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు వైసీపీ దురాగతాల నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, వెంకటేశ్వరరావు, భాస్కర పంతులు, కోలాటం హరి, శింగంశెట్టి నరేంద్ర, పత్తి నారాయణ, ఆకుల చలపతి, మౌల, నాసర్ ఖాన్, చిట్టే బాస్కర్ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.