అశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన, వ్యక్తుల పేర్లతో కొత్త జిల్లాల లొల్లి

పెడన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన కొత్త సమస్యలను, సామాజిక వర్గాల మీద తీవ్రప్రభావాన్ని చూపనుంది. పునర్విభజన కూడా అశాస్త్రీయంగా జరిగింది. ఉద్యోగుల ఆందోళనలను పక్కదారి పట్టించేందుకే హడావిడిగా కొత్త జిల్లాలో నోటిఫికేషన్లు విడుదల చేశారు. ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ అని పైకి చెబుతున్నా, కొత్త జిల్లాల వల్ల వాస్తవానికి రెవెన్యూ వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగుల జీతాలు పెంచమని ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెబుతున్న వైసిపి ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల పెంపుతో వచ్చే రెవిన్యూ వ్యయని ఎలా సర్దుబాటు చేస్తారో కూడా చెప్పాలి. ఏ జిల్లాకి వ్యక్తుల పేర్లు పెట్టొద్దు. ఒకవేళ పెట్టవలసి వస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా జాతీయ నాయకుల పేర్లు, స్వతంత్ర సమరయోధులు పేర్లు, సంఘసంస్కర్తల పేర్లు పెట్టాలి. అంతేగాని కృష్ణాజిల్లాలోని విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టి, రెండు సామాజిక వర్గాల మధ్య మంట పెట్టి చలికాచుకునే ధోరణి విడనాడాలి. ఈ కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల మచిలీపట్నానికి ప్రత్యేకంగా వచ్చింది ఏమీ లేదు. ఈ పట్టణ ప్రజలు కోరుకునేది మచిలీపట్నం పోర్టు. కొత్తగా జిల్లా గుర్తింపు కాదు. పక్క రాష్ట్రం అయిన తెలంగాణలో జిల్లాల పునర్విభజనతో సాధించింది శూన్యం. కొత్త జిల్లాలు రాజకీయ నిరుద్యోగులకు కొంత పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడ్డాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. చివరగా 13 జిల్లాలకు మూడు రాజధానులు అయితే కొత్తగా ఏర్పడబోయే ఇరవై ఆరు జిల్లాలకు 6 రాజధాని కడతారా? గుంతల రోడ్లు, వర్షం వస్తే మునిగిపోయే బస్టాండ్ ఉన్న మనకు 26 ఎయిర్ పోర్ట్లు కడతారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది కొత్త జిల్లాలు కాదని సరి కొత్త నాయకుడు గాడితప్పిన ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చక్కదిద్దే నవ నాయకుడని పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్.వి బాబు సమ్మెట అన్నారు.