ప్రత్తిపాడులో జనసేన జెండా ఆవిష్కరణ మరియు క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ప్రత్తిపాడు నియోజకవర్గం, ప్రత్తిపాడు మండలం, లంపకలోవ గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ మరియు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్(బాబి), జిల్లా జనసేన ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, శంఖవరం మండల జనసేన అధ్యక్షులు గాబు సుభాష్, కత్తిపూడి గ్రామ అధ్యక్షులు పోసిన శ్రీను మరియు లంపకలోవ గ్రామ జనసేన నాయకులు పంది వీర రాఘవులు, మేకల మాధవరావు, పంది భద్రం, నక్కా శ్రీనువాసరావు, చీమల శ్రీను, సిగిరెడ్డి కిషోర్, పంది శ్రీను, పంది సురేంద్ర, లింగంపల్లి తేజ, అడపా సత్యనారాయణ, పవన్, కొండబాబు, పంది చిన్నా, మరియు లంపకలోవ గ్రామ జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.