వీర్నమలతాండలో జనసేన జెండా ఆవిష్కరణ

కుప్పం, గత సంవత్సరం రాష్ట్ర మరియు జిల్లా జనసేన నాయకుల ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, వీర్నమలతాండలో ఆవిష్కరించిన జండాదిమ్మెను కొన్ని రోజుల ముందు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది. శనివారం చిత్తూరు జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఎక్కడైతే ధ్వంసం చేసారో అదే స్థలంలో పెద్ద ఎత్తున జండా ఆవిష్కరణ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసీ సభ్యులు జిల్లా అధ్యక్షులు డా హరిప్రసాద్, కీర్తన, తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్, జిడి నెల్లూరు ఇన్చార్జ్ డా. పొన్న యుగందర్, రాష్ట్ర ఐటి సెల్ సెక్రెటరీ శీను, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, నాయకులు బాను, నెహ్రూ అలాగే నియోజకవర్గంలోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వామనమూర్తి, జిల్లా కార్యదర్శి రామమూర్తి, సంయుక్త కార్యదర్శులు వేణు, మునెప్ప, నవీన్, ఐటి కోఆర్డినేటర్ మధు, కుప్పం నాయకులు నరేష్ మండల అధ్యక్షులు హరీష్, కిషోర్, సుధాకర్, అమీర్ మరియు మండల కమిటీ సభ్యులు జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.