జానపాడు గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ మరియు బహిరంగ సభ

గురజాల, 22-10-22 అనగా శనివారం, పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామం నందు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ మరియు బహిరంగ సభ. సాయంత్రం 4 గంటల నుండి పిడుగురాళ్లలోని గవర్నమెంట్ కాలేజీ వద్ద నుండి జానపాడు గ్రామంలోని సభా వేదికవరకు నాయకులతో భారీ ర్యాలీగా బయల్దేరి జానపాడు గ్రామం చేరుకోవడం జరుగుతుంది అనంతరం, సాయంత్రం 4-00 గంటలకు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ మరియు 5 గంటలకు బహిరంగ సభ నిర్వహించటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అధికార ప్రతినిధులు గురజాల నియోజకవర్గం నాయకులు పాల్గొనడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ముక్యంగా పల్నాడు ప్రాంత జనసేన నాయకులు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామని పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ పిలుపునిచ్చింది.