చిన్నటేకూరులో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

ఉమ్మడి కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం: కల్లూరు మండలం, చిన్నటేకూరు గ్రామంలో జనసేన పార్టీ వై.బజారి, హుస్సేన్ పవర్, జి. శివ, ఎన్న్ శివ, బి మాధవయ్య, కె మద్దిలేటి, ఎస్ నబి సాబ్, టి చిన్న వారి మిత్రబృందం ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి జండా ఆవిష్కరించిన ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ బాబు చింత టీడీపీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ & మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి శ్రీ తెలుగు గోవిందరాజు, రాయలసీమ ప్రాంతీయ వీర మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి హసీనా బేగం, కోడుమూరు నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాంబాబు, బి సుధాకర్ సతీష్, జనసేన పార్టీ వీరమహిళలు పల్లవి, గంగావతి మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జన శ్రేణులు పాల్గొన్నారు.