గుండ్లపల్లి గ్రామంలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

సత్తెనపల్లి నియోజకవర్గం: గుండ్లపల్లి గ్రామం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరి గురించి వివరిస్తూ ముఖ్యంగా పల్నాడు ప్రాంతం గురించి గత ఐదు దశాబ్దాలుగా అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు పల్నాడు ప్రాంతం వెనకబడింది వెనుకబడిందని చెప్తున్నారు కానీ ఆ పల్నాడు ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు మాత్రం వేల కోట్లుకు అధిపతులు అవుతున్నారు కానీ ఆ ప్రాంతం మొత్తం వెనుకబడి ఉంటుంది. మా ప్రాంతంలో ఉన్న కొండలను గుట్టలను గ్రానైట్ను మైనింగ్ను ఆక్రమించి దానిమీద వస్తున్న వందల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులు జీవుల్లోకి వెళుతున్నాయి తప్ప వాటి ప్రతిఫలాలను ఆ ప్రాంత ప్రజలకు గాని ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించకుండా వెనుకబడిన ప్రాంతంగా చెప్పి ఇంకా రాజ్యమేలుతున్నారు. అలాగే భారీ నీటిపారుల శాఖ మంత్రులుగా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబు గారి సత్తనపల్లి నియోజకవర్గంలో రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయని, సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల రాష్ట్రంలో రైతులు మరియు ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో రైతులు నీటి ఎద్దడి ఏర్పడి ముంత నష్టపోయి తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. కనీసం భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులుగా ఉండి మన రాష్ట్ర వాటా గురించి గానీ మన రాష్ట్రానికి రావాల్సిన నీరు గురించి గానీ మాట్లాడి రైతులు పక్షాలు నిలబడాల్సింది పోయి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కరువు లేదు ఏ నియోజకవర్గంలోనూ కరువు ప్రాంతాలు లేవని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి రైతులు కంట కన్నీరు పెట్టిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మారాలన్న రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలన్న, ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మరియు టిడిపి పార్టీలు ఉమ్మడిగా 2024లో ఎలక్షన్లో పోటీ చేయాలని ఈ రాష్ట్ర ప్రజల ముందుకు వస్తున్నారు. ప్రజలందరూ ఆలోచించి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే విధంగా ఉమ్మడి ప్రభుత్వం పని చేస్తుందని ప్రజలకు తెలియచెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు ఉమ్మడి గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ అడపాల మాణిక్యరావు, షేక్ ఇస్మాయిల్ బేగ్, వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జి కొజ్జేటి నాగ శ్రీను, గుంటూరు జిల్లా కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, సత్తెనపల్లి టౌన్ ప్రెసిడెంట్, రాడ్లు శీను, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ బత్తిన శీను, బాదనీయుడు సుబ్బారావు, గుండ్లపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉదరపు చిన్న రాజుకి ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు నియామక పత్రాలు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండలం, వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి వెంకటస్వామి, అంచుల అనూష్, గుండ్లపల్లి గ్రామ అధ్యక్షుడు ఉదారపు చినరాజు, దూదేకుల సైదు మస్తాన్, షేక్ మస్తాన్ వలి, టిడిపి నాయకులు బత్తుల సాంబ, శ్రీను, దూదేకుల సైదులు, బాజీ, గోపి, టిడిపి నాయకులు సగిణాల ఎల్లమంద, జనసేన పార్టీ నకరికల్లు మండలం ప్రధాన కార్యదర్శి రామాంజి, షేక్ ఖాజావలి జనసేన, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.