సమంతకి బాధ్యతలు అప్పచెప్పిన మెగా కోడలు

మెగా కోడలు ఉపాసన ఏ పని చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. రామ్ చరణ్ భార్యగానే కాక తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను చూసుకుంటున్న ఆమెకు సామాజిక బాధ్యత ఎక్కువ. ఎప్పుడూ సామాజిక అంశాలకు సంబంధించి జనాన్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తూ సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటోందామె.

తాజాగా URLife.co.in అనే వెబ్ సైట్ ను సొంతగా ప్రారంభించిన ఉపాసన.. URLife.co.in వెబ్ సైట్ కి గెస్ట్ ఎడిటర్ గా సమంత అక్కినేనిని ప్రకటించారు. టెక్నాలజీని వాడుకుని నిజంగా ఎక్స్ పర్ట్స్ అయిన వారి నుండి సలహాలు సూచనలు తీసుకుని తమ తమ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి ఉపయోగపడేలా ఉపాసన ఈ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు. యుఆర్ లైఫ్ టీంలోని హెల్త్ ఎక్స్ పర్ట్స్, ఫిట్నెస్ ఎక్స్ పర్ట్స్, అలానే న్యూట్రీషన్ ఎక్స్ పర్ట్స్ ఇలా అంతా కలిసి తమ వెబ్ సైట్ రీడర్స్ కోసం సీజనల్ గా తగిన తగిన ఆరోగ్య సూత్రాలను, పోషకాల గురించిన వీడియోస్, డైట్ ప్లానింగ్స్, లైఫ్ స్టైల్ సలహాలను, సూచనలను, ఆరోగ్యాన్ని పెంపొందించే వంటకాలని, సొంతగా చేసుకునే ఎక్సర్ సైజులు ఎవరికీ తగ్గ బడ్జెట్ లిమిట్స్ లోనే వారికి సూచనల ద్వారా అందిస్తున్నారు. “URLife.co.in వెబ్ సైట్ ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం నేచర్ లివింగ్, హెల్త్, మెంటల్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసేందుకే. ఇండియన్ కార్పొరేట్ ఫీల్డ్స్ లో సుమారు కోటి నలభై లక్షల మందికి లైఫ్ స్టైల్ టిప్స్, అడ్వైస్ లు అందిస్తూ దేశంలోనే అతిపెద్ద ఆరోగ్య సేవలు అందిస్తున్న సంస్థల ద్వారా URLife.co.in వెబ్ సైట్ రన్ చేస్తున్నారు.