తమన్నాకు ఉపాసన సాయం

టాలీవుడ్ బ్యూటీ తమన్నా హైదరాబాద్‌లో జరుగుతున్న వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో కరోనా సోకగా.. చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్న సంగతి తెలిసిందే.  కరోనా నుండి కోలుకునేందుకు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటనే అడ్మిట్ అయి నిపుణులైన డాక్టర్ల సంరక్షణలో చికిత్స తీసుకున్న అనంతరం.. డాక్టర్ల సలహాతో తానిప్పుడు డిశ్చార్జ్ అయ్యానని’ తమన్నా తాజాగా వెల్లడించింది.

అయితే తమన్నా త్వరగా కోవిడ్ నుంచి కోలుకోవడం వెనుక ఓ వ్యక్తి ఉన్నారట. ఆ వ్యక్తి ఎవరో కాదు టాలీవుడ్ నటుడు రాంచరణ్ సతీమణి కొణిదెల ఉపాసన. తమన్నా తనకు మంచి ఫ్రెండ్ కావడంతో ఉపాసన వెంటనే అపోలో ఆస్పత్రికి పంపించి..తమన్నాకు మంచి చికిత్సనందించడమే కాకుండా ఆమె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుందట. ఉపాసన తీసుకున్న స్పెషల్ కేర్ వల్లే తమన్నా త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిందన్నమాట. మొత్తానికి తన స్నేహితురాలికి కష్టకాలంలో అండగా నిలిచారు ఉపాసన.