ఉపాసన, సమంతల కొత్త ప్లాన్

స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత ఒక వైపు సినిమాలలో విజయ పరంపరను కొనసాగిస్తూనే బిజినెస్లో కూడా అడుగుపెట్టింది. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదల వ్యాపార రంగంలో తనదైన ముద్రతో కొనసాగుతున్నారు. అయితే ఈ ఇద్దరు సెలబ్రిటీల కలయికతో పని చేసేందుకు రెడీ అవుతున్నారన్న వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. స్టార్ హీరో సతీమణి మరియు స్టార్ హీరోయిన్ సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలో ఈ ఇద్దరు తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

తాజాగా వీళ్లిద్దరు కలిసి ‘urlife_co_in ? సబ్ స్క్రైబ్ చేసుకోమని అభిమానులను కోరారు. మరి వీళ్లిద్దరు కలిసి యువర్ లైఫ్ డాట్ కామ్ సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో సబ్ స్క్రైబ్ చేసుకోమని చెప్పారు. మరి వీళ్లిద్దరు యువర్ లైఫ్ అనేది స్వచ్ఛంద సంస్థ లాగే కనిపిస్తుంది. ఈ మాధ్యమం ద్వారా వీళ్లిద్దరు కలిసి ఏమైనా సహాయ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారా అనేది ఆసక్తికరంగా మారింది.