నిర్మాతగా మారనున్న మెగా కోడలు ఉపాసన.. హీరోగా రామ్ చరణ్..

మెగా కోడలిగానే కాకుండా అపోలో csr హాస్పటల్స్‌కు వైస్‌ చైర్మన్‌గా, అపోలో లైఫ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌ గా పనిచేస్తున్న ఉపాసన కామినేని కొణిదెల.. ఓ షార్ట్‌ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారు. కరోనా మహ్మమారికి ఎదరు నిలుస్తూ.. ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వైద్య సిబ్బంది కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. యువర్‌ లైఫ్ సంస్థను స్థాపించి ఆరోగ్య ప్రాధాన్యతను అందరికీ తెలిసేలా చేస్తూ.. పేదవారికోసం ఉచిత వైద్య సదుపాయం అందిస్తున్న ఉపాసన#8230; కరోనా వారియర్స్‌ జీవితాలను ప్రతిబింబించేలా.. వారి త్యాగాలను, కష్టాలను గుర్తుకు చేసేలా ఈ షార్ట్‌ ఫిల్మను తెరకెక్కించాలనుకుంటున్నారట. అందుకోసం కొంత మంది డైరెక్టర్లతో మంతనాలు కూడా చేస్తున్నారట. ముఖ్యంగా త్రివిక్రమ్, సుకుమార్ పేరులు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు టాప్ డైరెక్టర్ల తోపాటు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో హీరోగా భర్త రామ్‌ చరణ్ ను తీసుకోనున్నారట ఉపాసన. కోవిడ్ వారియర్‌ పాత్రలో చరణ్‌ అయితే బాగుంటారని.. చెప్పాలనుకున్న మెసేజ్‌ అందరికీ త్వరగా చేరుతుందని ఆమె భావిస్తున్నారట.

రామ్ చరణ్‌తో పాటు మరో శర్వానంద్ తో కూడా ఉపాసన అండ్ టీం మంతనాలు జరుపుతోందట. ఈ షార్ట్ ఫిల్మ్లోనే మరో పాత్రను హీరో శర్వాతో చేపించేందుకు ట్రై చేస్తున్నారట ఉపాసన. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.