మామగారి బాటలోనే పయనిస్తున్న మెగా కోడలు ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి తనదైన నటనా శైలి తో ఎందరో ప్రేక్షక అభిమానుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పేరుమీద బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకులను స్థాపించి ఎన్నో ప్రాణాలను రక్షించి తన సామాజిక బాధ్యతను తెలియచేశారు. ఇప్పుడు అదే బాటలో ఆయన కోడలు ఉపాసన కూడా అదే బాట లో నడుస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. సమాజం పట్ల ఎంతో అవగాహన ఉన్న ఆమె తన సేవా కార్యక్రమాలతో ప్రజలకు తన వంతు సహాయం చేస్తున్నారు.

ఉపాసన కొణిదల అపోలో హాస్పిటల్ యాజమాన్యంలో అత్యున్నత స్థానంలో ఉన్న ఆమె మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందితో ఉన్నారని అనిపించిన ప్రతిసారి ఆమె తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తుంటారు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ సమయంలో ఉపాసన పేద ప్రజలకు ఆరోగ్య భీమా గురించి వెల్లడిస్తూ మరొకసారి తనదైన శైలిలో స్పందించారు. మీరు ఎవరయినా కరోనా కవచ్ లేదా కరోనా రక్షక్ పాలసీ గురించి విన్నారా…? అంటూ ఉపాసన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దాదాపు మధ్యతరగతి 50 కోట్ల మంది మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యానికి ఈ భీమా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ప్రభుత్వ స్కీములు లేనివారికి అండగా ఉండటానికి రూపొందించిన భీమా పాలసీలని పేర్కొన్నారు అతి తక్కువ ప్రాణం తోనే రుణం తోనే ఈ పాలసీలు చేసుకోవచ్చని తెలిపారు. దాదాపు 50 కోట్ల మధ్యతరగతి భారతీయ కుటుంబాలకు అండగా నిలవడానికి ముందుకు వచ్చామన్నారు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వాలతో కలిసి ప్రజారోగ్యానికి సహకరించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకువచ్చామని అపోలో హెల్త్ ఇన్సూరెన్స్ తరుపున ట్విట్టర్ లో స్పందించారు.

దేశమంతటా పలు రాష్ట్రాల్లో అమలు లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ప్లాన్స్ గురించి ఉన్నటువంటి ఒక వీడియోను ఉపాసన ఈ సందర్భంగా షేర్ చేశారు. ఏపీ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మధ్యతరగతి కుటుంబాలకు ఏ విధంగా అండగా నిలుస్తున్నామనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించడమే తమ ధ్యేయమని ఈ ట్వీట్ లో పేర్కొన్నారు.