కాపుల అభ్యున్నతి జనసేనతోనే సాధ్యం..

  • ముద్రగడ్డ లేఖ ఆయన వ్యక్తిగతం..
  • ద్వారంపూడీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు..
  • జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్..

అనంతపురం: కాపుల అభ్యున్నతి పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని.. ముద్రగడ పద్మనాభం లేఖ ఆయన వ్యక్తిగతమని, కాపు జాతికి సంబంధం లేదని కాపు సోదరులు భావిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా కాపులకు వైసిపి ఏం చేసిందో ముఖ్యమంత్రిని ప్రశ్నించలేని ముద్రగడ ఇప్పుడు లేఖలు రాసుకుంటూ కాపు జాతిని మరొకసారి మోసం చేసే విధంగా వ్యవహరిస్తే మోసపోయేందుకు కాపులు ఇక సిద్ధంగా లేరని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూనే.. కాపుల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యల పట్ల చిత్తశుద్ధి కలిగిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బాటలోనే కాపులందరూ సిద్ధంగా ఉన్న క్రమంలో.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతిలో చీలికలు తీసుకొచ్చే విధంగా ఎవరు వ్యవహరించినా వారిని కాపు సమాజం దూరంగా పెడుతుందన్నారు. ఇక కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు. ఆయన గురించి పవన్ కళ్యాణ్ వాస్తవాలే మాట్లాడారని.. కాకినాడ ప్రజలే చెబుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ తో పోటీపడే స్థాయి ద్వారంపూడికి లేదని.. మరొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని పత్తి చంద్రశేఖర్ ఘాటుగా హెచ్చరించారు.