ఉప్పల్ నియోజకవర్గ జనసేన పార్టీ ప్రణాళికా సమావేశం

హైదరాబాద్, ఉప్పల్ నియోజకవర్గ జనసేన పార్టీ ప్రణాళికా సమావేశం శనివారం ఉప్పల్ లో గల కె.కె.ఆర్ ఫంక్షన్ హాలునందు ఉప్పల్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్య నిర్వాహకురాలు శ్రీమతి నీహారిక నాయుడు ఆధ్వర్యంలో జనసేనపార్టీ తెలంగాణా ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ముఖ్య అతిధిగా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. జనసేన నాయకులకు ఉప్పల్ నియోజకవర్గ జనసేన శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అధిక మొత్తంలో జనసేన క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వాలంటీర్లను సత్కరించడంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణాలోనే తక్కువ సమయంలో అత్యధిక క్రియాశీలక సభ్యత్వాలు 1004 ఉప్పల్ నియోజకవర్గం నుండే నమోదు అయ్యాయని తెలిపారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. నియోజకవర్గంలో రానున్న ఎన్నికలలో ఏ విధంగ ముందుకు వెళ్ళాలి ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి అనే అంశాలపై పలువురు జనసేన నాయకులు సలహాలు సూచనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బూత్ కమిటీల నియామకం చేయాలని త్వరలోనే పార్టీ తరపున అన్ని డివిజన్లకు ఇంచార్జులను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. టికెట్ ఎవరికిచ్చినా అందరు కలసికట్టుగా పనిచేసి అధినేతకు ఉప్పల్ నియోజకవర్గ విజయాన్ని గిఫ్ట్ గా ఇవ్వాలని తెలిపారు. తెలంగాణాలో జనసేన అనేక సమస్యలపై చేసిన పోరాటాలను పలువురు నాయకులు గుర్తుచేసారు. రానున్న ఎన్నికలలో తెలంగాణలో జనసేన 32 నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 32 నియోజక వర్గాలకు జనసేన పార్టీ కార్య నిర్వాహకురాలు నియమించటమే కాకుండా జనసేనపార్టీ తెలంగాణా ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ 7మందితో కూడిన తెలంగాణ జనసేన పర్యవేక్షణ కమిటీని కూడా నియమించడం జరిగింది. చివరిగా సమావేశాన్ని జనసేనపార్టీ తెలంగాణా ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మాట్లడుతూ అందరు తమ తమ ఓట్లను చెక్ చేసుకోవాలని, కొత్త ఓట్లను నమోదు చేయించాలని, జనసేన పార్టీ సమస్యలపి పోరాటం చేస్తుందని, అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కార్యక్రమాలను మరియు దానాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళాలని మరియు ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేయాల్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, పర్యవేక్షణ కమిటీ సభ్యులు, వివిధ నియోజకవర్గాల కార్యనిర్వాహకులు, వివిధ డివిజన్ల నాయకులు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Untitled photo
Untitled photoUntitled photoUntitled photoUntitled photoUntitled photoUntitled photoUntitled photoUntitled photoUntitled photoUntitled photoUntitled photoUntitled photo
Untitled photo
Untitled photo
Untitled photo
Untitled photo
Untitled photo
Untitled photo
Untitled photo
Untitled photoUntitled photoUntitled photoUntitled photo