శ్రీవారిని దర్శించుకున్న ‘ఉప్పెన’ టీం

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ‘ఉప్పెన’ చిత్రం భారీ వసూళ్లను రాబట్టుకుంటుంది. వీరిద్దరికి ఇదే తొలి సినిమా కావడంతో ఆనందంలో ఉన్నారు. హీరోయిన్ కృతి శెట్టికి ఈ సినిమా ద్వారా మరిన్ని సినిమా ఆఫర్లు వస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబుకి ఇదే మొదటి దర్శకత్వ సినిమా కావటంతో ఉప్పెన చిత్రబృందం అంత శ్రీవారిని దర్శించుకుంది. ‘ఈ సినిమా స్క్రిప్ట్‌ను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందామని, అందుకే ఈ సినిమా విజయం సాధించిందని’ బుచ్చిబాబు తెలిపారు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కాలినడకన మెట్ల మార్గాన శ్రీవారిని దర్శించుకున్నారు. వారు కొండెక్కుతుండగా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.