భయం గుప్పిట్లో పిడుగురాళ్ల అర్బన్ క్లినిక్

  • నాసిరకం నిర్మాణమే కారణం: జనసేన నాయకులు

గురజాల మండల జనసేన అధ్యక్షులు కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రధాన ద్యేయం అంటూ గొప్పలు చెప్పే ఈ ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తుందని అన్నారు, పిడుగురాళ్ల పట్టణం..జానపాడు రోడ్డు లో అట్టహాసంగా ప్రారంభించిన వైయస్సార్ అర్బన్ క్లినిక్ ను 90 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించి, ఆర్భాటంగా ప్రారంభించిన క్లినిక్ అనేక చోట్ల నెర్రలిచ్చి, పగుళ్లు ఏర్పడి పెచ్చులూడుతున్నాయని ఇది చాలా దారుణమని అన్నారు. జిల్లా జాయింట్ సెక్రటరీ దూదేకుల ఖాసీం సైదా మాట్లాడుతూ రోగులు, డాక్టర్లు, భయం గుప్పిట్లో ఉంటున్నారని అన్నారు. ఆసుపత్రికి రోగాల నయం చేసుకోవడానికి వస్తే.. ఇంటికి పోయే దాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారని అన్నారు. భవన నిర్మాణ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆరు సచివాలయాల పరిధిలో ప్రజలకు సేవాలందించాల్సిన ఆసుపత్రి, కట్టిన 5 నెలల్లోనే మరమ్మత్తులు చేసే పరిస్తితి రావటం అద్వానమనిన అన్నారు. పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ముఖ్యమంత్రి గొప్పలు చెప్తున్నారని, తీరా క్లినిక్ లో పరిస్థితి చూస్తే దారుణంగా ఉందని అన్నారు. ప్రజా సొమ్ము ను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. దెగ్గర దెగ్గర కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తే. కనీస నిర్మాణ విలువలు కూడా గుత్తే దారు పాటించలేదని మూడు రంగులు వేసుకోవడంలో ఉన్న శ్రద్ధ నిర్మాణంలో చూపించలేకపోయారని వద్దేవా చేశారు. మండల ఉపాధ్యక్షులు పెద్ద కొలిమి కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఇంజినీర్లు క్వాలిటీ చెక్ చేయకుండా మొద్దు నిద్ర పోతున్నారని అన్నారు. పేరుకే అర్బన్ క్లినిక్ అనీ, కనీస సిబ్బంది కూడా అందుబాటులో లేరని, అవినీతికి తావే లేదని చెప్పే స్థానిక ఎమ్మెల్యే ఈ వైద్యశాల ఒకసారి సందర్శించాలని అన్నారు. చుట్టూ ప్రహరీ గోడ కూడా లేదని. వాడి పడేసిన సర్జికల్ వ్యర్దాలు క్లినిక్ ఆవరణలో బహిరంగంగా పడేస్తున్నారని, ఇది కొత్త రోగాలకు దారితీస్తుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరారు. జానపాడు గ్రామ ప్రధాన కార్యదర్శి అంబటి సాయి మాట్లాడుతూ.. చుట్టూ ప్రహరీ లేకపోవడం ఒక ఎత్తు అయితే క్లినిక్ ఆవరణలో భారీ ట్రాన్స్ఫార్మర్స్ ఉండడం భయాందోళనకు గురిచేస్తోందని అన్నారు. పొరపాటున చిన్న పిల్లలు అటు వైపుకు వెళ్తే ప్రాణాలు పోవడమేనని అన్నారు. కనీస భద్రత చర్యలు లేవని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఆవుల రమేష్, మండల కార్యదర్శి షేక్ వలి, జానపాడు గ్రామ అధ్యక్షుడు పసుపులేటి నరసింహారావు, ముక్కంటి, మల్లెల రామాంజి, నాగమల్లి, సుబ్బారావు, శేషు, మనోహర్ మొదలగువారు పాల్గొన్నారు.