మతసామరస్యానికి ప్రతీక ఉరుసు

  • జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట: మత సమరస్యానికి ఉరుసు ప్రతీక అని జనసేన రాజంపేట నియోజకవర్గ నేత యల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. నందలూరు గ్రామపంచాయతీ నందు వెలసిన శ్రీ శ్రీ శ్రీ హజరత్ మగ్ధుం బాబా ఉరుసు మహోత్సవంలో గురువారం పాల్గొన్న రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజుకు ఘనంగా స్వాగతం పలికిన దర్గా కమిటీ సభ్యులు. ముందుగా దర్గా గురువులయ్య ఇంటి నుండి చాదర్ ను శ్రీనివాసరాజు తలపై పెట్టుకుని దర్గాకు తీసుకువెళ్లి హజరత్ మగ్దుం బాబా సమాధి వద్ద సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ మతసామరస్యానికి ఉరుసు ప్రతీక అని అన్నారు. ప్రతినిత్యం మీకు అందుబాటులో ఉంటానని ప్రతి కార్యక్రమంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా దర్గా అభివృద్ధికి 50 వేల రూపాయలు విరాళంగా మత పెద్దలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నందలూరు మాజీ జెడ్పిటిసి శివరామరాజు, నందలూరు ఉపసర్పంచ్ ఇబ్బూ, ఎంపీటీసీ సుభాన్, అజీజ్, బిజెపి నాయకులు షబ్బీర్ అహ్మద్, జుల్ఫికర్, షాకీర్,ఆకులు చలపతి, రాజంపేట నాయకులు సింగంశెట్టి నరేంద్ర, నాసర్ ఖాన్, మౌలా, పత్తి నారాయణ మరియు నందలూరు జనసేన నాయకులు గురివిగారి వాసు, మండెం రాము, మస్తాన్ రాయల్, సాయి పవన్, హరీష్, ఇస్మాయిల్, చోటు, మిషారి, అలీ, మహమ్మద్ నూర్, రత్నం, తరుణ్, ప్రకాష్, హరి, భాషా, మురళి, శివ మరియు మల్లి తదితరులు పాల్గొన్నారు.