కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ పేరు.. మెగాస్టార్ హర్షం

ఏపీ సీఎం జగన్ నేడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విమానాశ్రయానికి తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరిట నామకరణం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇది నాకెంతో ఆనందాన్నిచ్చింది. అలనాటి స్వాతంత్ర్య సమరయోధుడికి దక్కిన అసలైన గౌరవిమిది. అలాంటి గొప్ప వ్యక్తి బయోపిక్‌లో నేను నటించడం, ఆయన పాత్రను నేను పోషించడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని చిరంజీవి పేర్కొన్నారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్రను ఆధారంగా చేసుకుని.. మెగాస్టార్ చిరంజీవి కథా నాయకుడిగా ‘సైరా’ చిత్రాన్ని తెరకెక్కించారు. కొణిదెల ప్రొడెక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.