ఓటీటీలో కనువిందు చేయనున్న V!
కరోనా వైరస్ నేపథ్యంలో ‘వి’ విడుదల ఆగిపోయిన నేచురల్ స్టార్ నాని 25వ సినిమా ‘వి’ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు సుమారు 5 నెలల నుండి ఎదురుచూస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణ సారథ్యం వహించిన ఈ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. శిరీష్, లక్ష్మణ్ హర్షిత్ రెడ్డి నిర్మాతలు. నాని తో పాటు సుధీర్‌భాబు, అదితి రావు హైదరీ, నివేదా థామస్ కీలక పాత్రలు పోషించారు. కొన్ని నెలల కిందట ఓటీటీ నుంచి భారీగా డిమాండ్ వచ్చినా దిల్ రాజు అందుకు నో చెప్పారు. కానీ ఇప్పట్లో థియేటర్లు తెరుచుకొనే అవకాశం లేని పరిస్థితుల్లో ఓటీటీ వైపు దిల్ రాజు మొగ్గు చూపారు.
ఇందుకోసం ప్రముఖ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీలైతే సెప్టెంబర్ నెలలో నాని ‘వి’ సినిమాను ఓటీటీలో చూసే ఛాన్స్ ఉంది.