వడ్డెర సమస్యల గురించి శ్రీ టి.సి.వరుణ్ ని కలిసి వివరించిన వడ్డెరలు

అనంతపురం జిల్లా, రాంనగర్లో జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ స్వగృహంలో కలిసిన వడ్డెర సమస్యలను వివరిస్తూ ST జాబితాలో చేర్చాలని, క్వారీ వర్కులలో వడ్డెర్లకు 80% వర్కులు ఇవ్వాలని జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ కి తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ మాట్లాడుతూ వడ్డెర సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఇంచార్జ్ శ్రీ సాకే పవన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ నాగేంద్ర, జనసేన నాయకులు శ్రీ పొదిలి బాబురావు, వడ్డెరలు శ్రీ B.పొలన్న, శ్రీ BC.పోలన్న, శ్రీ D.రామాంజనేయులు, శ్రీ V.రాజు, శ్రీ A.వెంకటేష్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.