రైతు సమస్యలపైన పోరాడుతున్న వడ్డిపిల్లి శ్రీనువాసరావు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం కోత్తకుంకాం, పైడియ్యవలస గ్రామంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో కోత్తకుంకాం సచివాలయంలో మంగళవారం రైతుసమస్యలపై.. రైతులకు పంటకు నష్టపరిహారం ఇంతవరకు మాగ్రామానికి ఎందుకు ఇవ్వలేదు అడగడానికి ఎఓ దగ్గరకు వెళితే.. అయిన లేని కారణంగా.. డిజిటల్ అసిస్టెంట్ దగ్గరకు వెళితే ఆమె సరైన వివరణ ఇవ్వని కారణంగా.. ఆమెపై లీగల్ గా మేము మీపైన కెసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు వివరణ ఇచ్చే వరకూ.. రైతులకు న్యాయం చేసే వరకూ.. పోరాడుతామని లావేరు మండలం జనసేన పార్టీ యంపిటిసి అభ్యర్థి వడ్డిపిల్లి శ్రీనువాసరావు మండిపడ్డారు. ఈ సమస్యలపై వివరణ ఇచ్చే వరకూ పోరాడుతామని రణస్థలం మండలం యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు 26-06-2022 తేది ఆదివారం రైతు సమస్యలపైన పోరాటం చెయ్యడాని సిద్ధంగా ఉన్నాము అని తెలియచేయడం జరిగింది. కావున ఈ ఆదివారం రైతులు అందరూ, నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు మరియు వీరమహిళలు హాజరు కావాలని వడ్డిపిల్లి శ్రీనువాసరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు పిడుగు నారాయణ, వడ్డిపిల్లి లక్ష్ముమ్మ, పీరికట్ల లక్ష్మునాయుడు, నడుపూరు సూర్యారావు, దోండపాటి చినబాబు, ఇనపకుర్తి రాజులమ్మ, తదితరులు రైతులు పాల్గొన్నారు.