గుంటూరు జిల్లా మార్కెటింగ్ సోసైటీ ఛైర్మన్ వడ్రాణం హరిబాబు నాయుడు జన్మదిన వేడుకలు శుక్రవారం ఉదయం గుంటూరు పట్టణంలో ఛైర్మన్ కార్యాలయంలో అభిమానులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అతిథులు, హరిబాబు నాయుడు సేవాభావాన్ని, పార్టీ కోసం అందించిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా ఉప్పు వెంకటరత్తయ్య మాట్లాడుతూ, హరిబాబు నాయుడు గారు సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ జిల్లా స్థాయిలోనూ, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో పరిశీలకులుగా పార్టీ బలోపేతానికి తన వంతు పాత్ర పోషించారని గుర్తు చేశారు. జన్మదిన వేడుకల్లో గుంటూరు జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధి బొబ్బిలి రామారావు, జనసేన జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్, పట్టణ కార్యదర్శులు కలగంటి త్రిపురా కుమార్, తోటకూర ఉదయ్, ఇతర జనసేన నాయకులు, పలువురు పీఠాధిపతులు, మహిళా నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. హరిబాబు నాయుడు గారు ప్రజల మద్దతుతో మరింత ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షిస్తూ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.
Share this content:
Post Comment