పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైకాపా ప్రభుత్వం

  • టిడ్కో గృహాలకు మోక్షం ఎప్పుడో?

అనంతపురం అర్బన్: నియోజకవర్గంలోని 14వ డివిజన్ లో ఆదివారం జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి పలు సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక డివిజన్ లో నివాసముండే జాఫర్ మెహిద్దిన్ సాబిరాబి దంపతులు టిడ్కో గృహాలకై 25వేల రూపాయలు చెల్లించి ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి దగ్గరకి స్థానిక కార్పొరేటర్ అబుసాలెం దగ్గరకు పలుమార్లు తిరిగిన స్పందించలేదని అందుకు వీరు తమవద్ద వారి గోడును వెలిబుచ్చుకుంటు మేము నగరంలో ప్రస్తుతం ఉన్న ధరలలో ఇళ్ళకి బాడుగలు కట్టలేకున్నామని మాకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారాన్నరని అంటూ.. గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ వైకాపా ప్రభుత్వం టిడ్కో గృహాలను నిరుపేద ప్రజలకు పంపిణీ చేయకుండా జగనన్న గృహాల పేరుతో మరో మోసానికి తెర తీశారని అయినప్పటికీ ఈ ప్రభుత్వం సమయం ముగుస్తున్న ఇప్పటికీ ఎవి పూర్తి చేయక ప్రజలను మభ్య పెట్టారని.. వీటితోపాటు ఇక్కడ మంచినీటికి అరకొర పైపు లైనులు వేసి నీటి సరఫరాను ఇప్పటి వరకు వీరికి అందించలేదన్నారు. ప్రజలు ఈవిషయాలన్ని గ్రహించి జనసేన టీడీపీ పార్టీలకు ఓటు వేసి ప్రజా ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని వెంటనే టిడ్కో గృహాల పంపినితో పాటు పలు ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.