శాటిలైట్ రైట్స్ లో దుమ్మురేపిన వకీల్ సాబ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండగా రీసెంట్ గా శాటిలైట్ రైట్స్ బిజినెస్ కూడా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు కొనేసిందని తెలుస్తుంది. 15 కోట్లకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడైనట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ సినిమా రేంజ్ ఏంటన్నది మరోసారి ఈ సినిమాతో తెలుస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మగువ సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. ఇక శాటిలైట్ రైట్స్ లో దుమ్ముప్రేపిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ లో కూడా అదరగొడుతుందని చెప్పొచ్చు. డిజిటల్ రైట్స్ డీల్ కూడా చర్చల దశల్లో ఉందని తెలుస్తుంది.

వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. పి.ఎస్.పి.కె 27వ సినిమాగా పిరియాడికల్ స్టోరీతో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ఇక దీనితో పాటు సాగర్ చంద్ర డైరక్షన్ లో మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ లో కూడా పవన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. 2021 లో వకీల్ సాబ్ తో పాటు ఏకే రీమేక్ కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.