షూటింగ్ పూర్తిచేసుకున్న ‘వకీల్ సాబ్’..

మొత్తానికి వకీల్ సాబ్ కుషూటింగ్ పూర్తై గుమ్మడి కాయ కొట్టారు. అరకు, హైదరాబాద్ సహా మరికొన్ని లోకేషన్స్‏లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. ఈ సినిమా షూటింగ్ చివరి రోజున పవన్ చిత్ర దర్శకుడితోపాటు, చిత్ర యూనిట్ సభ్యులతో ఫోటోలు దిగారు. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‏గా మారాయి. దీంతో పవన్ సినిమా పూర్తికావడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాలో పవన్ లుక్‏కు అభిమానులు ఫిదా అయిపోయారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి  మేకప్ వేసుకున్నారు. వకీల్ సాబ్ చిత్రంతో పవన్ చిత్రసీమ కు రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి సంగతి తెలిసిందే.

వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ని దిల్ రాజు- బోణి కపూర్ లు నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు 80 % షూటింగ్ జరుగగా..ఆ తర్వాత లాక్ డౌన్ రావడం తో షూటింగ్ ఆగిపోయింది. రీసెంట్ గా షూటింగ్ లకు అనుమతులు రావడం తో మళ్లీ షూటింగ్ మొదలు పెట్టి అనుకున్న దానికంటే ముందే షూటింగ్ పూర్తి చేసారు. నిన్నటి తో షూటింగ్ అంత పూర్తి అయినట్లు నిర్మాతల్లో ఒకరైన బోనికపూర్ తెలిపాడు. ఈ మేరకు పవన్‌తో చిత్రయూనిట్ దిగిన ఫొటోలను షేర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *