వకీల్ సాబ్ మూవీ హైలైట్స్ లీక్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ మూవీ పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా..దిల్ రాజు , బోనికపూర్ లు నిర్మిస్తున్నారు. శృతి హాసన్ , అంజలి , నివేద థామస్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా సంక్రాంతి రోజున ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అంతకు ముందే ఈ టీజర్ బయటకు వచ్చింది.

ఇప్పటికే ఈ టీజర్ ఎలా ఉంటుందో కొన్ని విషయాలు బయటకు రాగా..ఇప్పుడు సినిమాలోని మరికొన్ని హైలైట్స్ బయటకు వచ్చాయి. టీజర్ లో మెట్రో రైలులో హీరో పైట్ సీన్ వుంటుంది. అలాంటి కోర్టులో కోటువేసుకుని వాదించగలను, కోర్టు బయట కోటు తీసి, వాయించగలను అనే లాంటి పవర్ ఫుల్ డైలాగు వుంటుంది.

టీజర్ చివరలో ఓ డిసిఎమ్ వ్యాన్ లో తన సామాను అంతా వేసుకుని పవర్ స్టార్ పడుకుని వెళ్తున్న సీన్ వుంటుంది. ఈ సీన్ నే గతంలో ఫస్ట్ లుక్ మాదిరిగా వదిలారు. ఇదిలా వుంటే వకీల్ సాబ్ లో మూడుకు పైగానే ఫైట్లు వుంటాయని తెలుస్తోంది. సినిమా ఓపెనింగ్ షాట్ నే ఫైట్ తో హీరో ఇంట్రక్షన్ వుంటుందని బోగట్టా. కాలనీలో అందరూ ఇళ్లు ఖాళీ చేస్తూ వుంటే హీరో మాత్రం చేయకుండా, వివేకానందుడి పుస్తకం చదువుతూ వుంటే రౌడీ లాక్కుని విసిరేస్తాడట. అప్పుడు హీరో వాడిన ఫాట్ మని తన్నడం, వాడు ఎగిరి దూరంగా పడడంతో హీరో ఇంట్రడక్షన్ వుంటుందని తెలుస్తోంది. మొత్తం మీద ఈ లీక్ లతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.