మళ్లీ థియేటర్స్‌లో సందడి చేయనున్న వకీల్ సాబ్..!

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ నుంచి వచ్చిన సినిమా ఇది. దాంతో అభిమానులు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది వకీల్ సాబ్. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించాడు. తాజాగా ఐ.ఎమ్.డీ.బి ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఇండియన్ వైడ్ గా ఏడో స్థానంలో నిలిచింది వకీల్ సాబ్. ఈ ఏడాది ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు దాదాపు 30 కోట్ల షేర్ వచ్చింది.

ఒకవైపు వైరస్ విజృంభిస్తున్న కూడా మరోవైపు పవన్ కళ్యాణ్ తన సత్తా చూపించాడు. అయితే సినిమా వచ్చిన రెండు వారాల గ్యాప్ లోనే కరోనా వైరస్ తీవ్రత పెరిగి పోవడంతో కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయాయి. మరో దారిలేక కేవలం 19 రోజుల వ్యవధిలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో లో సినిమాలు విడుదల చేశారు. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో చూడాలని ఆశ పడిన చాలామంది అభిమానులకు, ప్రేక్షకులకు ఈ వైరస్ బ్రేకులు వేసింది. ఈ సమయంలో వకీల్ సాబ్ దర్శక నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త సినిమాలు ఏవి విడుదల చేయడం లేదు. మరోవైపు జూలై వరకూ థియేటర్లు తెరుచుకునే ఆప్షన్ కూడా కనిపించడం లేదు. పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత జూలైలో థియేటర్లో తెరిస్తే.. మరోసారి వకీల్ సాబ్ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పాత సినిమా కాకుండా కొన్ని కొత్త సన్నివేశాలు యాడ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. నిడివి ఎక్కువ అయినా కూడా కొన్ని సన్నివేశాలు జత చేస్తే చూసే ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మరి ఈ ప్రయత్నం ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.