వకీల్ సాబ్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ మూవీ పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా..దిల్ రాజు , బోనికపూర్ లు నిర్మిస్తున్నారు. శృతి హాసన్ , అంజలి , నివేద థామస్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఈ సినిమాను థియేటర్లలో వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు.

ఈ ప్రకటన చేసి చాల రోజులు అవుతున్న ఆ తర్వాత నుండి చిత్ర యూనిట్ నుండి ఎలాంటి ప్రకటన రాకపోయేసరికి అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ తరుణంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సరికొత్త అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపారు. పాటల షెడ్యూల్ మొదలయ్యింది అని ఇక నుంచి అప్డేట్స్ కూడా వరుసపెట్టి వస్తాయని క్లారిటీ ఇచ్చారు. దీంతో అభిమానుల సంబరాలు మొదలైనట్లే.