వాలసి గ్రామ పంచాయితీ గిరిజనులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తిలేదు..!: చిట్టం మురళి

అల్లూరిసీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం, అనంతగిరి మండలం: జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ.. వాలసి గ్రామ పంచాయితీ గిరిజనులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తిలేదని.. 5 షెడ్యూల్ ప్రాంతంలో గిరిజన ప్రతినిధులు అయిన ఎం.పి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీటీసీ, ఎంపిపి స్థానిక ఎంపీటీసీ సర్పంచ్ లకు గ్రామ సభ నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా వాలసి గ్రామ పంచాయితీ లో రెవెన్యూ సిబ్బంది గ్రామ సభ ఎలా నిర్వహించారు. ఇదేనా ప్రభుత్వ ప్రజాస్వామ్యం..? లేదా బ్రిటిష్ పరిపాలన నడుస్తుందా..? ఇలాంటి గ్రామ సభలు జరుగుతున్నా అడిగే అధికారి లేడు, నిలదీసే నాయకుడు లేడు అంతా అధికార పార్టీ దందా. దీనిని ప్రజాప్రతినిధులకు చాలా అవమానకరం. గ్రామ సభ జరిపిన అధికారులు ప్రోటోకాల్ ప్రకారముగా గ్రామసభలు జరపాలి లేదా వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వాలసి మైనింగ్ ఎవరి గురించి..? వాలసి గ్రామ పరిధిలో ఉన్న ప్రజలకు మేలు జరగనప్పుడు మైనింగ్ తియ్యడం అవసరమా? పంచాయితీ పరిధిలో ఉన్న యువతీ యువకులకు ఏపీఎండీసీలో ఉపాధి లేనప్పుడు మైనింగ్ అవసరమా..? కనీసం భూమి కలిగి ఉన్న వారికి.. కూలి పని చేసిన వారికి నష్టపరిహారం ఇవ్వలేనప్పుడు గ్రామ సభ కి విలువ ఉందా..? జరిగిన గ్రామ సభ చట్ట విరుద్ధమైనది 5వ షెడ్యూల్ ప్రాంతంలో పిసా చట్టాన్ని, గ్రామ సభని దుర్వినియోగం చేశారు. గిరిజనులకు పటిష్టమైన పిసా చట్టాన్ని తుంగ లో తొక్కు తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. చట్ట వ్యతిరేకమైన గ్రామ సభ నిర్వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అందుకే నేటికీ మన గ్రామాలు అభివృద్ధి జరగటం లేదు. అక్కడ గిరిజనులకు ఉపయోగం లేని మైనింగ్ ఎందు కోసం.. ఎవరి కోసం.. మైనింగ్ జరుగుతుంది. గ్రామ సభ జరిగిన అధికారులు గిరిజన జాతికి సమాధానం చెప్పాలి అని మురళి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ సమన్వయ కమిటీ కొర్ర ప్రవీణ్, దండుసేన నవీన్, మండల నాయకులు మంగళ రామారావు, సన్యాసిరావు, వీరమహిళ రత్న ప్రియ, మండల ఉపాధ్యక్షులు కొర్ర రమేష్ పాల్గొన్నారు.