వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ!

*కేంద్రమంత్రి ప్రహ్లాద జోషితో వాల్మీకుల ఎస్ టి బిల్లు గురించి చర్చించిన,
వాల్మీకి రాష్ట్ర అధ్యక్షుడు, జనసేన పార్టీ ఇన్చార్జి వాల్మీకి లక్ష్మన్న

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో మంత్రాలయం టౌన్ పద్మనాభ తీర్థ గెస్ట్ హౌస్ నందు కేంద్రమంత్రి ప్రహల్లాద జోషిని కలిసిన రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ, రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ మంత్రాలయం నియోజక వర్గం ఇన్చార్జ్ బి లక్ష్మన్న సెంట్రల్ మినిస్టర్ ప్రహల్లాద జోషిని కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు. తదనంతరం వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని ప్రస్తుతం వాల్మీకుల ఎస్టీ బిల్లు కేంద్రంలో బిల్ పెండింగులో ఉందని సెంట్రల్ మినిస్టర్ కు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వాల్మీకుల స్థితిగతుల గురించి లక్ష్మన్న కేంద్రమంత్రి రాళ్ల జోషికి వివరిస్తూ మేము గత 40 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని రాష్ట్ర అసెంబ్లీలో వాల్మీకుల ఎస్టీ బిల్ పాసై కేంద్రానికి వెళ్లిందని, కేంద్రంలో పెండింగ్లో ఉందని లక్ష్మన్న తెలిపారు. అందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా ఆ బిల్లును ఫాలోఅప్ చేస్తానని మాట ఇచ్చారు. ఒకసారి హుబ్లీకి వచ్చి కలవండని కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి లక్ష్మన్నకు చెప్పారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి రాష్ట్ర ఉపాధ్యక్షులు, బిజెపి రాష్ట్ర నాయకులు జగ్గాపురం చిన్న ఈరన్న, బిజెపి జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, బిజెపి మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

Share this content:

Post Comment