బి.లక్ష్మణ్ ను కలిసిన వాల్మీకి బోయ నాయకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది వాల్మీకి బోయల ఎస్టీ బిల్లు గురించి కర్నూలు జిల్లా, మంత్రాలయ నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జీ బి. లక్ష్మణ్ ని తన స్వగృహంలో, వాల్మీకి బోయ నాయకులు కలసి ఎస్టీ బిల్లు గురించి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి వాల్మికి బోయల, ఎస్టీ బిల్లు కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం కాని ఎలాంటి ఫలితం చూడలేకపోయాం. ఇప్పుడు ఈ ఎస్టీ బిల్లు, కూటమి ప్రభుత్వం వలన అవుతుందని నమ్మకం కలుగుతుంది, ఎందుకంటే కేవలం ఇద్దరు కారణం. మా అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పి.ఎం మోదీ, వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు కారణం, కనుక దయచేసి మీ ఇద్దరు కలగచేసుకొని మా ఈ ఎస్టీ బిల్లు పాస్ చేస్తే మా 50 లక్షల వాల్మీకి బోయలు మీకు మా జీవితాంతం ఋణపడి ఉంటామని మీడియా ముఖంగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పోతులపాడు నాగరాజు, గంజలి పూర్ణ నాయుడు, వెంకటేష్, దత్త, మల్లేష్, శివ పాల్గొనడం జరిగింది.

Share this content:

Post Comment