పవన్ కళ్యాణ్‌కు వాల్మీకి బోయల మద్దతు

*జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి అండగా 50 లక్షల మంది వాల్మీకి బోయ ఓటర్స్
*మంత్రాలయం నియోజకవర్గం జనసేన ఇంచార్జ్, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ బి లక్ష్మన్న

మంత్రాలయం నియోజకవర్గంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జ్ బి లక్ష్మన్న మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారికి 50 లక్షల మంది వాల్మీకి బోయ ఓటర్లు అండగా నిలుస్తారని ప్రకటించారు. వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించే దిశగా పవన్ కళ్యాణ్ కృషి చేయాలని కోరుతూ, త్వరలో ఆయనను కలిసి అన్ని విషయాలను చర్చిస్తామని, ఈ విషయంలో నాగబాబు హామీ ఇచ్చినట్టు తెలిపారు. వాల్మీకి బోయలు గత 40 సంవత్సరాలుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారనీ, 1956లో వాల్మీకి బోయలను కొన్ని జిల్లాల్లో ఎస్టీలుగా, మిగతా జిల్లాల్లో బీసీ ఏ కింద చేర్చి వివక్ష కలిగించారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం అగ్రవర్ణాల నాయకులు వాల్మీకి బోయలను ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. ఈ వర్గం ఇప్పటికీ విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉందని పేర్కొంటూ, పవన్ కళ్యాణ్ గారు తమ హక్కుల కోసం కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో చర్చించి, పెండింగ్‌లో ఉన్న ఎస్టీ బిల్లును ఉభయ సభల్లో పాస్ చేయించేందుకు ఆర్థికం చేయాలని విజ్ఞప్తి చేశారు. వాల్మీకి బోయ ఓటర్లు రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నారని, ఈ వర్గం ఓటు బ్యాంక్‌గా మారి, తాము రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపై కదలాలని లక్ష్మన్న పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు వాల్మీకి బోయ నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment