పాడేరులో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన వంపూరు గంగులయ్య

పాడేరు, అరకు పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం. ముందుగా క్రియాశీలక జనసేన సభ్యత్వ నమోదు చేయు వలంటీర్లకు సూచనలు, సలహాలు పలు టెక్నికల్ సమస్యలు అధిగమించి సభ్యత్వ నమోదు చేయడంపై అవగాహన కల్పించారు, ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని, పార్టీ అభిమానులకు ఈ క్రియాశీలక సభ్యత్వం చేయించాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కార్యకర్తల రక్షణార్థం రూపకల్పన చేసినటువంటి గొప్ప ఆలోచన ప్రస్తుతం రాష్ట్రమంతటా మరియు ఇలాంటి ఆదివాసీ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పర్యటించి ఈ గొప్ప ఆలోచన విధానాన్ని పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సింది యువకులేనని డాక్టర్ గంగులయ్య తెలిపారు. ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు సభలో పాడేరు జనసేన మండల అధ్యక్షులు ఎన్.మురళి కృష్ణ, జి మాడుగుల నాయకులు మసాడి భీమన్న, మండల అధ్యక్షులు జీ.మురళి, ప్రధానకార్యదర్శి, యూత్ అధ్యక్షులు షేక్ మస్తాన్, గౌరవ అధ్యక్షులు టి. వి రమణ, గౌరవ ఉపాధ్యక్షులు పి. గంగప్రసాద్, చింతపల్లి మండల నాయకులు వి. బుజ్జిబాబు, దేపురు రాజు, పవన్ తేజ్, ప్రసాద్, కె.అశోక్ కుమార్, సత్యనారాయణ, ఎస్.అశోక్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.