క్రియాశీలక సభ్యత్వ నమోదు పోస్టర్ ను ఆవిష్కరించిన డా. వంపూరు గంగులయ్య

అల్లూరిసీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో ఆదివారం జనసైనికుల భద్రత కొరకు అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం మేరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు పోస్టర్ ను పాడేరు అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య ఆవిష్కరించారు. చింతపల్లి, జి. మాడుగుల, పాడేరు మండలాల నాయకులు, తాజంగి గ్రామ యువత సహాయంతో జనసైనికుడు వి.శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా డా. గంగులయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రజానీకానికి ఉద్దేశించి మనం శ్రమజీవులం, నిత్యం ఉరుకుల పరుగుల జీవనంలో అనుకోకుండా ఏదైనా ఉపద్రవం సంభవించినప్పుడు మన కుటుంబాలకు, మన ఆరోగ్య భద్రత సహాయానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి జనసైనికులు, వీరమహిళల క్షేమార్థం ఈ క్రియాశీలక సభ్యత్వం అనే విధానం సూచించారు. మీకు అందరికి ఇప్పటికే తెలిసి ఉంటుంది సుమారు రాష్ట్రంలో ప్రమాదవశాత్తు మరణించిన 96మంది కార్యకర్తలకు ప్రమాద భీమాగా 4 కోట్ల, 80 లక్షల రూపాయలు అందించారు. ప్రమాదవశాత్తు గాయపడిన 169 మందికి జనసైనికులకు 60,90,781 రూపాయలు అందించారు. 265మందికి
మొత్తంగా 5,40,90,781 రూపాయలు అందించడమైనది. ఈ విధమైన ఆలోచన అవినీతితో కూరుకుపోయే ఏ రాజకీయాపార్టీ దేశంలో ఎక్కడా, ఏర్పాటు చేసినట్టు చరిత్రలోనే లేదు. ఒక తరానికి మంచి భవిష్యత్ ఇవ్వాలని అవినీతి, బంధుప్రీతి, కుటుంబ రాజకీయ నియంత వారసత్వాన్ని బలంగా వ్యతిరేకించి, ఎదిరించి నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రతి అభిమాని, ప్రతి జనసైనికుడు, ప్రతి వీరమహిళ పల్లెల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, రానున్న ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యంగా పని చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో చింతపల్లి తాజంగి యువత వి.శేఖర్, టి.లోవరాజు, టి.బాబుజి, టి.గణపతి, ఏ. గోవింద్, కె. వంశీ, ఎస్.గౌతమ్, కె. హేమ, ఏ. విజయ్, ఎ. నానజీ, టి.కిషోర్, జి.మాడుగుల మండల అధ్యక్షులు, మసాడి భీమన్న, యూత్ ఉపాధ్యక్షులు, మస్తాన్, మాతే ఖుషి, పాడేరు నాయకులు సత్యనారాయణ మజ్జి, అశోక్ కిల్లో, సంతోష్ మజ్జి తదితర జనసైనికులు పాల్గొన్నారు.