పాడేరు జనసేన పార్టీ భవన ప్రారంబోత్సవానికి పార్టీ పెద్దలను ఆహ్వానించిన వంపురు గంగులయ్య

జనసేన పార్టీ మంగళగిరి (గుంటూరు) జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పి.ఎ.సి అధ్యక్షులు నాదెండ్ల మానోహర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో వివిధ జిల్లాలు, నియోజకవర్గాల ముఖ్యనేతలు, ఇన్చార్జిలు వీరమహిళా విభాగం అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో ప్రధానంగా సుమారు 83మంది ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల వారి వారి కుటుంబాలకు లక్ష రూపాయల నగదు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కౌలు రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత విధానాలతో మోసం చేసిందని, రైతులపట్ల వైస్సార్సీపీ కి ఉన్న ఔదార్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సినిమా నా వృత్తి, నా వృత్తి ధర్మాన్ని కూడా రాజకీయం చేస్తూ పాలన విస్మరించి కాలయాపన చేస్తుందని రాబోయేది కచ్చితంగా వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోనికి రాదని అందరూ గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. క్షేత్ర స్థాయి లో జనసైనికులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి నియోజక వర్గంలో నా కళ్ళు వుంటాయని రాజకీయ వ్యూహాలను నాకు వదిలేయాలని నేను 2007 నుంచే రాజకీయాల్లో ఉన్నననే విషయం గుర్తుంచుకోవాలని తెలిపారు. కేవలం నా సినిమాల ద్వారా వచ్చిన డబ్బునే నేడు ఆత్మ హత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక చేయూత దృష్ట్యా ఇస్తున్నామని, అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏమిచ్చిందో ఎలా ఆదుకుందో తెలపాలని సూటి ప్రశ్న సంధించారు. పి.ఎ.సి అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ అనుసరించని విధానం జనసేన అనుసరిస్తుందని.. తన సొంత సంపాదనతో నేడు కౌలు రైతుల కుటుంబాలను అదుకున్నారని.. దేశంలోనే పవన్ కళ్యాణ్ గారిని ఒక అరుదైన నేతగా అభివర్ణించారు. అధికారంలో లేకున్నా రైతు బడుగు, బలహీనుల కొరకు అహర్నిశలు శ్రమించే నాయకుల్లో పవన్ కళ్యాణ్ జీ ఒకరని తెలిపారు. అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తి చేసుకున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి అధోగతి పాల్జేసిందని ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారికి సవాల్ చేస్తున్నాను రైతు సాధికారత కోసం ఇప్పటివరకు నిర్మాణాత్మకమైన ఆలోచన చేసారా? లేదంటే ఇలానే ఆత్మ హత్యాల్ని ప్రోత్సహిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం సంక్షేమం పేరిట సర్వం దోచుకోవడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది అంటూ విమర్శించారు. ప్రజల్లో మార్పు కోసం ఒక స్పష్టమైన ఆలోచన వచ్చింది దాన్ని రానున్న 2024లో అచరణలో పెడతారని ఉద్గాటించారు. మీకు తెలుసు సమాచార మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఈ ప్రభుత్వం ద్వారా మన అధినేత సినిమాలనే రాజకీయం చేసి టికెట్లు అమ్ముకున్నారని ఎటువంటి శాస్త్రీయ విధానాలతో కూడిన సమాచారం లేకుండా జిల్లాల విభజన చేసారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జి డా..వంపురు గంగులయ్య హాజరయ్యారు. అలాగే సమావేశంలో పలు ముఖ్యనాయకులు వీరమహిళల సమక్షంలో పలు కీలక రాజకీయాంశలు, క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించి, విద్య, వైద్య, ఉపాధి వంటి అంశాలపై తీర్మానం చేశారు. సభ అనంతరం డా..గంగులయ్య పి.ఎ.సి అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ ను పి.ఎ.సి సభ్యులు పార్టీ పెద్దలు కొణిదెల నాగబాబు ను వ్యక్తిగతంగా కలిసి గిరిజన ప్రాంత సమస్యలు అల్లూరి సీతారామరాజు జిల్లాగా ప్రకటించిన తర్వాత ఎదురయ్యే సమస్యలు, ఎటువంటి జనాభా గణాంకాలు లేకుండా పలు సమస్యలతో విభజన, భౌగోళిక స్థితిగతులు, పాలన పరమైన ప్రభుత్వ రంగ సంస్థలు మౌలిక సదుపాయాలు సమస్యలు, విద్య, వైద్య, గిరిజన రైతుల పంటలకు గిట్టుబాటు, రవాణా సదుపాయాలు, మార్కెట్ వ్యవస్థ లోపాలు, కొత్త జిల్లాగా అల్లూరి జిల్లా ప్రకటించినందుకు సగటు ప్రతి ఆదివాసీ ఆనందపడాలో.. పాలన పరమైన లోపాలను చూసి ఆవేదన చెందాలో తెలియక ప్రజలు అయోమయానికి గురౌతున్నరని తెలిపారు. పాడేరు నియోజకవర్గం కేంద్రంలో నిర్మించిన జనసేన పార్టీ భవన ప్రారంబోత్సవానికి సాదరంగా ఆహ్వానించడం జరిగిందని.. అందుకు పి.ఎ.సి అధ్యక్షుల నాదెండ్ల మనోహర్, పి.ఎ.సి సభ్యులు పెద్దలు కొణిదెల నాగబాబు కూడా తప్పకుండా హాజరౌతామని తెలిపారని ఈ విషయం జనసైనికులకు, వీరమహిళలకు, నా గిరిజన ప్రజలకు తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందని డా. వంపురు గంగులయ్య పత్రికా ముఖంగా తెలిపారు.