గుడ్లనార్వ గ్రామం, గుడ్లనార్వ తాండాలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర

  • పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 24వ రోజు కార్యక్రమం

నాగర్ కర్నూల్, పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా రెండవ విడత కార్యక్రమంలో భాగంగా బిజినపల్లి మండలం, గుడ్లనార్వా గ్రామంలో, గుడ్లనార్వ తాండాలో వంగ లక్ష్మణ్ గౌడ్ మంగళవారం పాదయాత్ర చేపట్టారు.. కార్యక్రమంలో జనసేన నాయకులతో, జనసైనికులతో కలిసి పాదయాత్రగా గ్రామంలో పర్యటించారు.. గ్రామాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ, కార్యక్రమాన్ని ముందుకు సాగించారు. గుడ్లనార్వా గ్రామంలో ప్రధాన సమస్యలు తెలంగాణ రాష్ట్రం అవిర్బించిన గత 8 సంవత్సరాల నుంచి ఏ హక్కుల కొసమైతే రాష్ట్రం సాధించుకున్నామో, ఆ హక్కులు లేకుండా పోయాయి.. నీళ్ళు, నిధులు నియమాకలతో సాధించుకున్న మన రాష్ట్రం అభివృద్ధి అనే ముసుగు వేసుకొని తిరుగుతుంది తప్ప వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది.. బంగారు తెలంగాణ చేస్తాం, ప్రతి ఇంట్లో పింఛన్లు అని చెప్పారు, ఇప్పుడు ఇంట్లో ఒకరికి పించన్ వస్తే మరొకరికి రావట్లేదు.. యువతను ఉద్యోగాల పేరుతో మభ్య పెట్టి ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకొని, ఇప్పుడు యువతకు అందుబాటులో ప్రతి గ్రామంలో 15 నుంచి 20 బెల్ట్ షాపులు పెట్టి యువతను మధ్యంలో ఉంచి వాళ్ళ పబ్బం గడుపుతున్నారు.. ఓట్లు వేయించుకునే రాజకీయ నాయకులలో మార్పు వస్తుంది కానీ, మా గ్రామాల అభివృధి కోసం, మా భవిష్యత్తు కోసం ఎంత మందికి ఒట్లేసిన ఎటువంటి మార్పు లేదు.. రైతే రాజు అంటారు, మాకు ఏమీ అవసరం లేదు.. మేము పండించే పంటకు మద్దతు ధర కల్పించండి చాలు..!
అంటూ గ్రామస్థులు వారి సమస్యలు లక్ష్మణ్ గౌడ్ కు తెలియజేశారు. గుడ్లనార్వా తాండాలో ప్రధాన సమస్యలు సీసీ రోడ్లు లేవు.. ఇళ్ల మధ్య మొరిలు ఏరులై పారుతున్నాయి, మురికి నీళ్ళు ఇళ్ల మధ్య ఆగిపోతున్నాయి.. వాటి వల్ల చిన్న పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు… పాలకులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.. అంటూ తాండాలోని ప్రజలు వారి సమస్యలు తెలుపుకున్నారు.. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు గోపాస్ కుర్మన్న, హారి నాయక్, సూర్య, వంశీ రెడ్డి, రాజు నాయక్, బోనాస్ శివయ్య, బాలకృష్ణ, తమ్మేడి పవన్, ఎజ్జు ఆంజనేయులు, మురళి, నరేష్, శంకర్, శ్రీకాంత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.