నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా వంగల దాలి నాయుడు

  • రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గొర్లి వెంకట రమణారావు
  • జిల్లా కార్యదర్శిగా బోనెల పరుశురాం
  • మానవ హక్కుల పరిరక్షణకు పాటుపడతామన్న నూతన కార్యవర్గం

పార్వతీపురం: జాతీయ మానవ హక్కుల కమిటీ (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ – ఎన్.హెచ్.ఆర్.సి.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యవర్గ నియామకాలను రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది కదిరి రాము ప్రకటించారు. దీనిలో భాగంగా జాతీయ మానవ హక్కుల కమిటీ (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ – ఎన్.హెచ్.ఆర్.సి.) పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడిగా వంగల దాలినాయుడును, జిల్లా కార్యదర్శిగా న్యాయవాది బోనెల పరశురామ్ ను, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గొర్లి వెంకటరమణరావును నియమించినట్లు వారు తెలిపారు. ఈ మేరకు గురువారం వారు పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ సామాన్యుల హక్కుల రక్షణ, భద్రత, కనీస ప్రయోజనాలను కాపాడటం కోసం జాతీయ మానవ హక్కుల కమిటీ (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ – ఎన్.హెచ్.ఆర్.సి.) కృషి చేస్తుందన్నారు. తమపై నమ్మకం నుంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు కదిరి రాముకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతలను శతశాతం నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. మానవ హక్కులను పరిరక్షించడం, మానవ హక్కుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలు చేపడతామన్నారు. జిల్లాలో ఎక్కడైనా మానవ హక్కులకు భంగం కలిగితే వారి చెంత నిలబడి వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. కాబట్టి జిల్లాలోని విద్యావంతులు, మేధావులు, సామాజిక వాదులు, సంఘసంస్కర్తలు, విద్యార్థులు ప్రజాప్రతినిధులు , అధికారులు ప్రజలు తమకు సహకరించాలన్నారు. ఎక్కడైనా మానవ హక్కులకు భంగం కలిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తమకు రాష్ట్ర జిల్లా ప్రతినిధులుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కదిరి రాముకు కృతజ్ఞతలు తెలియజేశారు.